టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఒక సినిమా హిట్ అవుతుంటే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. వరుసగా విజయాలు సాధించే విషయంలో రవితేజ ఫెయిల్ అవుతున్నారు. హీరోయిన్ల, డైరెక్టర్ల ఎంపిక విషయంలో సైతం రవితేజ పొరపాట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అయితే ప్రముఖ బ్యానర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రవితేజకు 4 సినిమాల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసిందని సమాచారం అందుతోంది.
మాస్ మహారాజ్ రవితేజకు ఒకేసారి నాలుగు సినిమాలకు ఆఫర్ దక్కడం అంటే ఆయన చాలా లక్కీ అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు రవితేజకు క్రేజ్ పెరుగుతోంది. రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలలో నటిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుండగా ఈగిల్ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.
మాస్ మహారాజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పండుగలను టార్గెట్ చేసుకుని రవితేజ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. రవితేజ పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో మాస్ మహారాజ్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.
మాస్ మహారాజ్ (Ravi Teja) వయస్సు 55 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. రవితేజ వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. రవితేజకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్