కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. మరో క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటి నడుమ జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. ఆశించిన స్థాయిలో ‘మాస్టర్’ ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది.
ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
3.08 cr
సీడెడ్
2.23 cr
ఉత్తరాంధ్ర
1.83 cr
ఈస్ట్
1.00 cr
వెస్ట్
1.04 cr
కృష్ణా
0.90 cr
గుంటూరు
1.15 cr
నెల్లూరు
0.53 cr
ఏపీ+తెలంగాణ టోటల్
11.76 cr
తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 11.76 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 2.76కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు.