ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణ వార్త అభిమానులకు ఎంతో బాధను కలిగించిందనే సంగతి తెలిసిందే. విద్యాసాగర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించగా ఆయన మరణానికి సంబంధించి వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. భర్త మరణం వల్ల మీనా బాధ పడుతున్నారు. అయితే పావురాల వ్యర్థాల గాలి పీల్చడం వల్లే మీనా భర్త చనిపోయారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల గురించి తాజాగా మీనా రియాక్ట్ అయ్యారు.
భర్త శాశ్వతంగా దూరం కావడం వల్ల నేను ఎంతో బాధ పడుతున్నానని మీనా తెలిపారు. మా ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె కోరారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని భర్త మరణం గురించి తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకొనిరావద్దని ఆమె చెప్పుకొచ్చారు. మీడియాకు తన రిక్వెస్ట్ ఇదేనని మీనా తెలిపారు. ఎవరైతే ఈ బాధాకరమైన సమయంలో కుటుంబానికి తోడుగా నిలబడ్డారో వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మీనా కామెంట్లు చేశారు.
మెడికల్ టీమ్ నా భర్తను బ్రతికించడానికి ఎంతో కష్టపడిందని తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖా మంత్రి, మా స్నేహితులు, మీడియాకు కృతజ్ఞతలు అని మీనా లేఖలో పేర్కొన్నారు. నా భర్త త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యాన్స్ ప్రేమకు ఏమిచ్చినా తక్కువేనని మీనా చెప్పుకొచ్చారు. మీనా పోస్ట్ చేసిన ఎమోషనల్ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలో మీనా స్పందించి భర్త మరణానికి సంబంధించి అసలు విషయాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.
పావురాల వ్యర్థాల వల్ల లక్ష మందిలో ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుందని అలా ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో విద్యాసాగర్ ఒకరని మీనా సన్నిహితులు చెబుతున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉండటం వల్లే సరైన సమయానికి డోనర్ దొరకక మీనా భర్త మృతి చెందారని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!