సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన మంగళవారం నాడు చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్టు తెలుస్తుంది.మీనా భర్త ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం మరొకటి ఉందట. అవే పావురాలు. వాటి వల్లే మీనా భర్త మరణించినట్టు చెన్నై మీడియా వర్గాలు చెబుతున్నాయి. అసలు మేటర్ ఏంటంటే…మీనా ఇంటి సమీపంలో చాలా పావురాలు ఉంటాయట.
వాటి వ్యర్ధాలు కలిసిన గాలి పీల్చినప్పుడు వారికి లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురైనట్టు వారు చెబుతున్నారు.అయితే విద్యాసాగర్ కోవిడ్ భారిన పడటంతో లంగ్స్ మరింతగా ఇన్ఫెక్ట్ అయినట్టు తెలుస్తోంది. లంగ్స్ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారట.ఆర్గాన్ డోనార్ కోసం కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారట. కానీ సరైన సమయంలో దొరకకపోవడంతో మీనా భర్త ప్రాణాలు కోల్పోయినట్టు చెన్నై మీడియా వర్గాలు చెబుతున్నాయి. తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా…
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు.కానీ కొత్త హీరోయిన్లు ఎంట్రీతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. 2009 లో ఈమె విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది. విద్యా సాగర్ బెంగుళూరుకు చెందిన బిజినెస్మెన్. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. ఈమె విజయ్ హీరోగా నటించిన పోలీసోడు( తేరి) చిత్రంలో అతని కూతురి పాత్రని పోషించింది. ఇక మీనా చివరిగా రజినీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమాలో కనిపించింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!