‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీనాక్షి చౌదరి, ప్రతీ ఏడాది ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’లో (Guntur Kaaram) ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించినా, పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అటువంటి పాత్రలో నటించకపోయినా బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ తరహా కామెంట్లు వచ్చినప్పటికీ, మీనాక్షి మాత్రం ప్రశాంతంగా స్పందించింది.
ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గుంటూరు కారం సినిమాలో నటించడం నాకు ఒక మంచి అనుభవం. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అవకాశం” అని తెలిపింది. పాత్ర పరంగా తక్కువ ప్రాధాన్యత ఉన్నా, తాను ఎలాంటి అసంతృప్తి లేకుండా ఆ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నానని మీనాక్షి స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో గుంటూరు కారం సినిమా విషయంలో మీనాక్షికి (Meenakshi) ఎలాంటి బాధ లేదని క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం మీనాక్షి వరుసగా చిత్రాలలో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘ది గోట్’ (The Greatest of All Time) సినిమాలో విజయ్‌తో (Vijay Thalapathy) కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) జోడీ కట్టిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే విధంగా, త్వరలోనే ఆమె విశ్వక్ సేన్‌తో (Vishwak Sen) కలిసి నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంతో మీనాక్షి తన నటనను మరింత ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తోంది. మొత్తానికి మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో మెయిన్ రోల్స్ పొందాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మహేష్ బాబుతో మరోసారి మంచి పాత్రలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నారు. తను కెరీర్ పరంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మీనాక్షికి అభిమానులు అభిలాషిస్తున్నారు.