సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!

నవంబర్ 14న విడుదలవుతున్న పెద్ద సినిమా “కంగువ”(Kanguva)  . సూర్య  (Suriya)  కథానాయకుడిగా శివ(Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తైన ఈ సినిమా ఓ పెద్ద దెబ్బ తగిలింది. ఓవర్సీస్ కాపీస్ మరియు వివిధ రాష్ట్రాలకు కాపీలు పంపాల్సిన సందర్భంలో “కంగువ” ఎడిటర్ యూసఫ్ నిషద్ మరణించాడు. ఇదివరకు “తల్లుమల్లా” సినిమాకి బెస్ట్ ఎడిటర్ గా కేరళ స్టేట్ అవార్డ్ అందుకున్న నిషద్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఎడిటర్.

Kanguva

“కంగువ”కి అతడి వర్క్ నచ్చి సూర్య తన తదుపరి చిత్రమైన “సూర్య 45”కి కూడా అతడ్ని ఎడిటర్ గా తీసుకున్నాడు. అయితే.. ఇవాళ (అక్టోబర్ 30) రెండు గంటల సమయానికి నిర్జీవంగా పడి ఉన్న నిషద్ శరీరం కొచ్చి లోని అతడి ఫ్లాట్ లో కనిపించింది. దాంతో కేరళ ఇండస్ట్రీ మరియు కంగువ టీమ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎంతో భవిష్యత్ ఉంది అనుకున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా నిషద్ మరణించడం అనేది బాధాకరం.

అతడి మరణానికి కారణం ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేదు. చాలా మంది గుండెపోటుతో మరణించాడు అంటున్నారు కానీ.. పోస్టుమార్టం అయితే కానీ ఇంకా ఏమీ క్లారిటీ రాదు. మరి “కంగువ” పెండింగ్ వర్క్ ఎవరు పూర్తి చేస్తారు అనేది చూడాలి. ఎడిటింగ్ టీమ్ మెంబర్స్ ఉన్నప్పటికీ.. నిన్ననే సెన్సార్ కట్స్ వచ్చాయి.

సదరు కట్స్ ను రీప్లేస్ చేయాలన్నా, కొత్త కట్స్ చేయాలన్నా ఆల్రెడీ సినిమా మీద వర్క్ చేసిన నిషద్ కే ఎక్కువ కమాండ్ ఉంటుంది. సో, ఇప్పటికిప్పుడు మరో ఎడిటర్ ఆ ప్రాజెక్ట్ ను అర్థం చేసుకోవడం, ఎడిట్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. మరి శివ & టీమ్ ఈ సమస్యను ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సినిమా ఆఫీస్ ఎవరిదబ్బా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus