Yash: యశ్ కొత్త సినిమా షూటింగ్ కి అడ్డుపడుతున్న మినిస్టర్!

“కేజీఎఫ్” (KGF)  లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రాకింగ్ స్టార్ యశ్ (Yash) తన తదుపరి సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. “కే.జి.ఎఫ్ 2” (KGF2)  2022లో విడుదలవ్వగా, తన తదుపరి సినిమా ఏమిటి అనేది ఎనౌన్స్ చేయడానికే దాదాపు రెండేళ్ల టైమ్ తీసుకున్నాడు యష్. ఎట్టకేలకు 2024లో గీతు మోహన్ దాస్ (Geetu Mohandas)  దర్శకత్వంలో “టాక్సిక్” (Toxic)  అనే సినిమాను ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమాలో యష్ ఓ లాయర్ గా కనిపించనున్నాడు.

Yash

ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఓ షెడ్యూల్ ను కర్ణాటకలోని పీన్యా అనే గ్రామంలోని ఓ అడవిలో నిర్వహించారు. అయితే.. ఆ అడవిని షూటింగ్ కోసం వేసిన సెట్ కారణంగా 100కి పైగా చెట్లు నరికివేయబడ్డాయని కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ లీగల్ యాక్షన్ తీసుకోనున్నారు. ఈ కారణంగా “టాక్సిక్” షూటింగ్ కి అంతరాయం కలగడమే కాక, ఈ చెట్లు నరికివేబడడానికి కారణంగా యశ్ కి కూడా లీగల్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.

అయితే.. ఈ లీగల్ నోటీసుల వెనుక రాజకీయ అంతర్యుద్ధం ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో రెండు పెద్ద రాజకీయ పార్టీలు కొట్టుకుంటూ మధ్యలోకి యష్ ని లాగారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో యష్ ఏమైనా రెస్పాండ్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉండగా.. “టాక్సిక్” సినిమా ఈ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. నిజానికి “టాక్సిక్”కి ఇలాంటి పబ్లిసిటీ అవసరం లేదు.

ఇకపోతే.. యశ్ “టాక్సిక్” అనంతరం బాలీవుడ్ లో “దంగల్” ఫేమ్ నితీష్ తివారి (Nitesh Tiwari)  తెరకెక్కించనున్న “రామాయణం”లో రావణుడిగా నటించడానికి సిద్ధమవుతున్నాడు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , సాయిపల్లవి (Sai Pallavi) సీతారాములుగా నటించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో యశ్ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus