హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్ మాత్రం ఆమెనే.. స్పెషల్ ఏంటో?
- May 8, 2026 / 12:11 PM ISTByFilmy Focus Desk
ఏదైనా సినిమా ప్రొడక్షన్ హౌస్‌లో హీరోలు రిపీట్ అవుతారు, దర్శకులు రిపీట్ అవుతారు.. అయితే హీరోయిన్లు రిపీట్ అవ్వడం చాలా తక్కువ. పెద్ద బ్యానర్లలో కొంతమంది హీరోయిన్లు రిపీట్ అవుతుంటారు కానీ.. స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న తర్వాత ఓ హీరోయిన్ రిపీట్ అవ్వడం అరుదు. అయితే మీనాక్షి చౌదరి విషయంలో ఇప్పుడు ఈ రిపీట్ ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పటికే బ్యానర్‌లో మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఆ బ్యానరే నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్మెంట
Meenakshi Chaudhary
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో మీనాక్షి చౌదరి రెండు సినిమాలు చేసింది. దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’, నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’తోపాటు నాగవంశీ మొదటి/ ప్రధాన బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్‌లో ‘గుంటూరు కారం’ చేసింది. అలా మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇటీవల ఓ వెబ్‌సిరీస్‌కి ఓకే చెప్పింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల సైలెంట్‌గా స్టార్ట్ అయిందని టాక్. త్వరో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారని సమాచారం.

ఇక లేటెస్ట్ విషయానికొస్తే.. ఇప్పుడు ఆ బ్యానర్‌లో ఐదో సినిమాగా కార్తితో కలసి నటించబోతోంది మీనాక్షి. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాల విజయాలతో మెప్పించిన కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తి ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైందని సమాచారం. వినోదాత్మక కథతో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు భోగట్టా. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుందని.. అప్పుడే అధికారికంగా సినిమాను ప్రకటిస్తారని చెబుతున్నారు.
కార్తి సినిమాల విషయానికొస్తే ‘సర్దార్ 2’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక మీనాక్షి సినిమా విషయానికొస్తే.. నాగచైతన్య ‘వృషకర్మ’, హిందీ సినిమా ‘బాగమ్ భాగ్ 2’ లైనప్‌లో ఉన్నాయి.











