Meera Chopra: ఆ హీరోను చూసి లవ్ లో పడ్డానన్న మీరా చోప్రా!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో మీరా చోప్రా ఒకరనే సంగతి తెలిసిందే. పవన్ హీరోగా తెరకెక్కిన బంగారం సినిమాతో మీరా చోప్రా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా ఈ సినిమాలో మీరా చోప్రా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో వాన, మారో, గ్రీకువీరుడు సినిమాలలో మీరా చోప్రా నటించారు. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.

ఈ మధ్య కాలంలో మీరా చోప్రాకు సినిమా ఆఫర్లు కూడా తగ్గాయి. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించిన ఈ నటి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన మీరా చోప్రా తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురు కాగా వాటి గురించి స్పందించలేదు. ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని మీరా చోప్రా సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు అందగాడు అని అయితే సర్కారు వారి పాట సినిమాను మాత్రం తాను చూడలేదని ఆమె వెల్లడించారు.

స్టార్ హీరో ప్రభాస్ ఆకర్షణీయంగా కనిపిస్తారని ప్రభాస్ గొప్ప నటుడు అని ఆమె చెప్పుకొచ్చారు. చరణ్ గురించి స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనను చూసి ఫిదా అయ్యానని ఆమె కామెంట్లు చేశారు. హీరో విజయ్ హ్యూమానిటీ ఉన్న వ్యక్తని పవన్ కళ్యాణ్ తో మళ్లీ నటించే ఛాన్స్ వస్తే నటిస్తానని పవన్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా చేయడం లేదని ఆమె కామెంట్లు చేశారు.

ఒక నెటిజన్ మీరెవరో నాకు తెలియదని కామెంట్ చేయగా గూగుల్ లో వెతికితే నా గురించి తెలుస్తుందని ఆమె అన్నారు. తెలుగులో ఈ హీరోయిన్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని సమాచారం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus