వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ చూసి మెగా ఫ్యాన్స్ అలా చెబుతున్నారా?

  • July 28, 2023 / 09:16 PM IST

చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ రిలీజ్ కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. తాజాగా భోళా శంకర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భోళా శంకర్ ట్రైలర్ కు తక్కువ సమయంలోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. ఈ ట్రైలర్ ను చూస్తే వింటేజ్ మెగాస్టార్ ను చూసినట్టు ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రైలర్ తమకు ఎంతగానో నచ్చిందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. ట్రైలర్ ఫుల్ మీల్స్ లా ఉందని వాళ్లు చెబుతున్నారు. ఈ సినిమా వాల్తేరు వీరయ్య సినిమాను మించిన సక్సెస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.

మెగాస్టార్ అంటే ఏంటో ఈ ట్రైలర్ ప్రూవ్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మెగాస్టార్ టైమింగ్ అదుర్స్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కష్టాన్ని నమ్ముకున్న చిరంజీవికి మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. 67 సంవత్సరాల వయస్సులో సైతం చిరంజీవి తన లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేస్తుండటం గమనార్హం. బ్రో, భోళా శంకర్ రెండూ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మాస్ ఫ్యాన్స్ మెచ్చేలా భోళా శంకర్ ట్రైలర్ ఉంది. చిరు రెబల్ స్టైల్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కమర్షియల్ ఫార్మాట్ లో బ్రో మూవీ తెరకెక్కుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్నాకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus