టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజ్ గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…50ప్లస్ లో కూడా నాగ్ ఇద్దరి హీరోల తండ్రిగా కూడా….తానే ఒక టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నాగ్…..ఒక పక్క మన్మదుడి ట్యాగ్ ఉండగానే….మరో పక్క దైవ కధలను ఎంచుకుంటూ ప్రేక్షకులను భక్తిలో మునిగి తేల్చుతున్నారు…ఇదిలా ఉంటే….మన టాలీవుడ్ మన్మదుడు నాగ్ కి…చిరంజీవికి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే…. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ రెండు కుటుంబాలు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అనేది ఓపెన్ సీక్రెట్. ఎవరి ఇంట్లో ప్రత్యేకమైన ఈవెంట్ జరిగినా..ఈ రెండు కుంటుంబాల మధ్య పండుగ వాతావరణం ఉంటుంది.
ఇక మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద ఖైదీ150 రుజువు చేసింది. ఇదిలా ఉండగా….ఇప్పుడు చిరు తన ఫోకస్ అంతా బుల్లి తెరపై పెట్టినట్లు టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. విషయంలోలోకి వెళితే…మాటీవీలో ప్రసారమయ్యే‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ కి చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 13న రాత్రి 9:30 నిముషాలకి మొదలుకానుంది. అయితే తాజాగా జరిపిన సర్వే ప్రకారం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంని గతంలో నాగార్జున చేసిన దాని కంటే ఎంటర్టైన్మెంట్ గా మెగాస్టార్ చేశాడనే టాక్స్ అంతటా వినిపిస్తున్నాయి. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షూటింగ్ ని నాగార్జున కంటే చింజీవి వేగంగానే చిరు పూర్తిచేశాడనే న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున కంటే చిరంజీవి చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయనేది ఇండస్ట్రీ టాక్స్. ఇది విన్న నాగార్జునకి ధిమ్మతిరిగే షాక్ ని ఇచ్చిందని అంటున్నారు. మొత్తానికి చిరు రాకతో నాగ్ కుర్చీకి ఎసరు పెట్టినట్లు అయ్యిందిగా….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.