యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తెచ్చేసింది. ఇక సోమవారం నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లే. అయితే ఈ సినిమాను మొదట కొందరు హీరోలు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే దర్శకుడు మున్నా ఈ కథను ఎక్కువగా చెప్పింది సత్యదేవ్ కు.
అతనితో టెస్ట్ షూట్ కూడా చేయగా అంత బాగా రాలేదట. అలాగే మెగా కాంపౌండ్ లో కూడా ఈ కథ బాగానే తిరిగిందట. అల్లు శిరీష్ కు కూడా చెప్పగా ఆల్ మోస్ట్ అన్ని సెట్టయ్యాయని అనుకున్న సమయంలో అనుకోకుండా సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇక ఆ తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం దర్శకుడు కథను చాలాసార్లు చేంజ్ చేసి చెప్పాడట. కానీ సాయి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. ఫైనల్ గా మున్నా యాంకర్ ప్రదీప్ ను కలిసి స్టోరీ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు.
ఇక సినిమాకు ఒక్క పాటతోనే భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అనూప్ రూబేన్స్ స్వరపరిచిన నీలి నీలీ ఆకాశం సాంగ్ ను సిద్ శ్రీరామ్, సునీతల ఎంతో చక్కగా అలపించారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ యూ ట్యూబ్ లో ఇప్పటికే 300మిలియన్ల వ్యూవ్స్ ను దాటేసింది.