డైలమాలో మెగా డాటర్!!!

  • August 4, 2016 / 07:17 AM IST

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే..అందం, అభినయం తో పాటు, అభిమానుల అండదండలు కూడా ఉన్న ఫ్యామిలీస్ లో ఈ ఫ్యామిలీ ఒకటి. అప్పటి పవర్ స్టార్ నుంచి ఇప్పటి మెగా పవర్ స్టాట్ వరకు ఇంచుమించు అంతా మెగా స్టార్ వారసులుగా ఇండస్ట్రీలో చాలామణీ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెర్గా ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు ఒక హీరోయిన్ కూడా తెరంగేట్రం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ మెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక తన తొలి సినిమా ‘ఒక మనసు’ డిజాస్టర్ కావడంతో కాస్త వెనక్కు తగ్గి, తన రెండో సినిమా కోసం కధలు వినడం మొదలు పెట్టింది. అయితే ఎన్నో కధలు వింటున్నప్పటికీ ఏమీ నచ్చక పోవడంతో, తండ్రి నాగ బాబును సైతం కధలు వినమని కోరగా…ఆయన కొన్ని కధలు విని అందులో ఒక మంచి కధ ఒకటి ఒకే చేశారు…సరే ఇక ఈ సినిమా చేద్దాం అని అనుకున్న తరుణంలో ఈ మధ్యే విడుదలయిన ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసిన నిహారిక ఆ సినిమా చూసి ఒక్కసారిగా షాక్ అయింది అని తెలుస్తుంది.

కారణం ఏంటి అంటే…,నిహారిక తన రెండవ సినిమాగా ఎంపిక చేసుకున్న కథ ‘పెళ్ళి చూపులు’ కథ ఇంచుమించు ఒకలాగే ఉన్న విషయం నిహారిక గ్రహించడంతో ఆమె మైండ్ బ్లాంక్ అయిందని తెలుస్తోంది. అయితే వెంటనే ఆ తనకు కధ చెప్పిన రైటర్ ను పిలిపించి తాను సినిమా  చెయ్యనని చెప్పేసి…మళ్ళీ కథలు వినే కార్యక్రమం ఆమె చేపట్టింది. పాపం తొలి సినిమా ఫ్లాప్ కావడంతో పూర్తి డైలమాలో ఉంది నిహారిక.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus