ఠాగూర్ లాంటి సినిమాలో చిరు.. ఫ్యాన్స్ కు పండగే..?

Advertisement

150కు పైగా సినిమాలలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఠాగూర్ సినిమా ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన రమణ సినిమాకు రీమేక్ గా వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఠాగూర్ తెరకెక్కింది. చిరు ఇమేజ్ ను పెంచిన సినిమాల్లో ఠాగూర్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. అవినీతి, లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

అయితే చిరంజీవి మళ్లీ ఠాగూర్ పాత్రను పోలిన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలలో ఏ డైరెక్టర్ సినిమా ఫస్ట్ మొదలవుతుందో తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ డైరెక్షన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా తెరకెక్కనుండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

వకీల్ సాబ్ సినిమాలా కోర్టు డ్రామాగా చిరంజీవి బాబీ కాంబినేషన్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఠాగూర్ సినిమాలోలా సమాజంలోని లోపాలను ఎత్తి చూపే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఈ సినిమాకు దర్శకుడు బాబీ వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. కోర్టు డ్రామాలో చిరంజీవి నటిస్తున్నాడని ప్రచారం జరగడంతో తమ్ముడు పవన్ కళ్యాణ్ బాటలో మెగాస్టార్ నడుస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus