రవితేజ అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

  • January 11, 2023 / 07:15 PM IST

చిరంజీవి రీఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిరంజీవి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి ఈ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…

ప్రేక్షకులు అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికి ఇష్టపడతారు అయితే తనకు అన్ని వైవిద్య భరితమైన పాత్రలలో నటించాలని ఉందని చిరంజీవి తెలిపారు. అయితే రాను రాను చిత్ర పరిశ్రమ ఆర్థికంగా కమర్షియల్ గా ముడి పడటంతో నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను పరిగణలో ఉంచుకుంటూ మనకు కావాల్సిన దానికన్నా ప్రేక్షకులకు ఏం కావాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయాల్సి ఉంటుందని చిరంజీవి తెలిపారు. ఇక ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అందుకు వందకు వంద శాతం న్యాయం చేయాలన్న ప్రయత్నంలో చేసిన సినిమానే వాల్తేరు వీరయ్య అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.

ఈ సినిమాలు రవితేజ కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోని రవితేజ గతంలో నటించిన సినిమాలకు ఇప్పుడు నటిస్తున్న సినిమాలకు ఏమైనా తేడా ఉందా అని అడగడంతో రవితేజ స్టార్ హీరో అయినప్పటికీ తనలో ఏ మాత్రం మార్పు లేదని తెలిపారు. రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి ఆయనలో ఎలాంటి మార్పు లేదు.

అదే ఎనర్జీతో ఇప్పటికే సినిమాలు చేస్తున్నాడు ఇక ఆయన ఆహారపు అలవాట్లలో కూడా ఏమాత్రం మార్పు లేదని, రవితేజలు అప్పటికీ ఇప్పటికీ అదే ప్రేమ, ఆప్యాయత ఉందని ఈ సందర్భంగా చిరంజీవి రవితేజ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus