Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్

  • February 22, 2025 / 11:42 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్

తెలుగు సినిమాపై, ఆ మాటకొస్తే భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిత్రసీమలోకి రావడానికి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి స్ఫూర్తిప్రదాత చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది.

ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. ఆల్ఫెడ్‌ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు.

‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ చూసిన చిరంజీవి ఆసక్తి కనబరిచారు. తాను పుస్తకం చదువుతానని తెలిపారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయం అని ప్రశంసించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి” అని అన్నారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి‌‌ ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా ముందుమాట రాశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్లో అడ్మిట్ అయిన మెగా మదర్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి దిగొచ్చిన విశ్వక్ సేన్.. సారీ చెబుతూ ఎమోషనల్ లెటర్!
  • 3 మహేష్ బాబు హీరోయిన్ ఘాటు కామెంట్స్ వైరల్!

‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’లో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ (HLF)లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ ప్రశంసలను అందుకున్నారు పులగం చిన్నారాయణ, రవి పాడి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Master of Suspense Hitchcock
  • #Megastar Chiranjeevi

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

14 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

15 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

15 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

17 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

19 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

13 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

16 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

19 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

20 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version