Chiranjeevi: చిరంజీవి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందా?

చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా ఒకటి. మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఫిబ్రవరి నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. చిరంజీవి మూవీ రీరిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవి మూవీ రీరిలీజ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ ఏడాది జనవరి నెలలో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరింది. గ్యాంగ్ లీడర్ రీరిలీజ్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. జనవరి నెల విన్నర్ ఏ సినిమా అనే ప్రశ్నకు సైతం వాల్తేరు వీరయ్య సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది. చిరంజీవి మూవీ రీరిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు చిరంజీవి వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

చిరంజీవి సక్సెస్ ఉన్న డైరెక్టర్లతో, స్టార్ డైరెక్టర్లతో, యంగ్ జనరేషన్ డైరెక్టర్ల డైరెక్షన్ లో వరుస సినిమాలలో నటిస్తున్నారు. రీఎంట్రీలో వరుస సినిమాలలో నటిస్తూనే వయస్సుకు తగిన రోల్స్ ను చిరంజీవి ఎంచుకుంటున్నారు. చిరంజీవి ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించాలని కొంతమంది ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. రీఎంట్రీలో మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి చిరంజీవి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

నటుడిగా చిరంజీవి స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా హీరోయిన్ల ఎంపిక విషయంలో చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లతో కూడా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రీఎంట్రీలో కూడా చిరంజీవి ఇతర స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus