Chiranjeevi: దర్శకుడితో కలిసి దమ్ము కొడుతున్న చిరు.వైరల్ అవుతున్న ఫోటో..!

  • November 17, 2022 / 07:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కోదండరామిరెడ్డి లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 23 సినిమాలు రూపొందాయి. ఇందులో ఎక్కువ శాతం హిట్టు సినిమాలే ఉన్నాయి.అయితే వీరి కాంబో అనగానే ఎక్కువగా ‘ఖైదీ’ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. అలాగే చిరంజీవికి స్టార్ ఇమేజ్ ను కూడా కట్టబెట్టింది ఈ మూవీ. నిజానికి ఈ మూవీని కృష్ణ గారితో చేద్దామని మొదట కోదండ రామిరెడ్డి గారు అనుకున్నారు.

కానీ ఆయన కాల్షీట్లు ఖాళీ లేకపోవడం వలన చిరంజీవితో చేశారు కోదండరామిరెడ్డి. ‘కిరాయి రౌడీలు’ ‘న్యాయం కావాలి’ ‘అభిలాష’ వంటి చిత్రాలతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందువల్లే చిరు వద్దకు ఖైదీ వెళ్ళింది అని చెప్పొచ్చు. వాటి తర్వాత కూడా వీరి కాంబినేషన్లో హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అందులో ‘రుస్తుం’ కూడా ఒకటి. 1984 లో చిరు- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన 9వ సినిమా ఇది.

‘పోకిరి’ సినిమాలో మాదిరే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో చిరు పోలీస్ అవతారంలో దర్శనమిస్తాడు. అప్పటివరకు అది అండర్ కవర్ ఆపరేషన్ అని చెబుతాడు. ట్విస్ట్ బాగానే ఉంటుంది కానీ కథ, కథనాలు బోరింగ్ గా ఉంటాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. ఊర్వశి ఈ చిత్రంలో చిరుకి జోడీగా నటించింది.

అయితే రుస్తుం షూటింగ్ గ్యాప్ లో దర్శకుడు కోదండరామిరెడ్డితో కలిసి చిరు సిగరెట్ షేర్ చేసుకుంటున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి స్నేహం ఎలాంటిది అనేది ఈ ఫోటో తెలియజేస్తుంది. మధ్యలో హీరోయిన్ ఊర్వశి ఆశ్చర్యంగా చూడటాన్ని కూడా మనం గమనించవచ్చు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus