మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కానీ టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. నిజానికి ఈ సినిమాకి ముందుగా ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకున్నారు. దర్శకుడు బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నారు. చిరు కూడా ఓకే అన్నారు. కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
చిరు సన్నిహితులు కొందరు ‘వీరయ్య’ అనే టైటిల్ మరీ పాతగా ఉందని.. మరో టైటిల్ పెడితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో చిరు కూడా బాబీను టైటిల్ మార్చమని అడిగారట. దీంతో ‘వాల్తేర్ శీను’ అనే కొత్త టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారు. మెగాస్టార్ కి ఈ టైటిల్ నచ్చడంతో దాదాపు దీన్నే ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. మంచి రోజు చూసుకొని ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బాబీ సినిమా మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరు మాస్ అవతారంలో దర్శనమివ్వనున్నారు.