Megastar Chiranjeevi: మెగాస్టార్ సీక్రెట్స్ రివీల్ చేసిన ప్రముఖ నటుడు!

  • May 28, 2022 / 11:40 AM IST

మెగాస్టార్ చిరంజీవికి రీఎంట్రీలో కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. చిరంజీవి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి. చిరంజీవి పలు రీమేక్ సినిమాలలో నటిస్తున్నా తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ కథలలో మార్పులు జరిగాయి. అయితే ప్రముఖ సీనియర్ నటులలో ఒకరైన భానుచందర్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా నాన్నకు తాను హీరోను అవుతానని ఎప్పుడూ నమ్మకం ఉండేది కాదని భానుచందర్ తెలిపారు. మా అమ్మ మాత్రం తాను హీరోను అవుతానని భావించేదని ఆయన అన్నారు. నాన్నకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో నువ్వైనా తెరపై కనిపించరా అని అమ్మ చెప్పేదని ఆయన తెలిపారు. తాను తరంగిణి సినిమాలో నటించిన తర్వాత స్నేహితులతో కలిసి ఆ సినిమాను థియేటర్ లో చూడాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ఫ్రెండ్స్ నా యాక్టింగ్ ను మెచ్చుకున్నారని ఆయన అన్నారు. రజనీకాంత్ ను స్పూర్తిగా తీసుకుని తాను సినిమాలలో నిలదొక్కుకున్నానని ఆయన వెల్లడించారు. అప్పట్లో తాను, చిరంజీవి రూమ్ మేట్స్ అని తనకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నేర్పించింది చిరంజీవేనని ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవికి తనకు ఏరా అనే స్నేహం ఉందని ఆయన మెగాస్టార్ అయినా తనకు స్నేహితుడే అని భానుచందర్ చెప్పుకొచ్చారు.

సింహాద్రి మూవీ సమయంలోనే రాజమౌళి స్టార్ డైరెక్టర్ అవుతారని చెప్పానని భానుచందర్ కామెంట్లు చేశారు. ఒక సినిమాను తెరకెక్కించడమే కాదు ఎలా బిజినెస్ చేయాలో కూడా ఆయనకు తెలుసని భానుచందర్ చెప్పుకొచ్చారు. భానుచందర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో భానుచందర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus