Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ”డియర్ మేఘ” నా డ్రీమ్ మూవీ: హీరోయిన్ మేఘా ఆకాష్

”డియర్ మేఘ” నా డ్రీమ్ మూవీ: హీరోయిన్ మేఘా ఆకాష్

  • August 28, 2021 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

”డియర్ మేఘ” నా డ్రీమ్ మూవీ: హీరోయిన్ మేఘా ఆకాష్

అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ….

– రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ”డియర్ మేఘ” విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో నెర్వస్ గా కూడా అనిపిస్తోంది. చాలా రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేసేందుకు దర్శకుడు సుశాంత్ రెడ్డి చాలా రోజులు ట్రై చేశారు. చివరకు నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి ఇలా ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉంది అని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఫీమేల్ సెంట్రిక్ అంటే చాలా ప్రెజర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు నేనున్న పొజిషన్ కు తప్పకుండా రిస్క్ చేయాలి, కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి అనుకున్నాను. డియర్ మేఘ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్, ఎమోషనల్, లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.

– డియర్ మేఘ సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. అబ్బాయి, అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మా చిత్రంలో జెన్యూన్ లవ్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. నా లైఫ్ లోనూ లవ్ ఉంది. అయితే డియర్ మేఘ చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి అనుకోవచ్చు.

– డియర్ మేఘ క్యారెక్టర్ కు నాకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. డియర్ మేఘ లోపల చాలా అల్లరి పిల్ల కానీ బయటకు కామ్ గా ఉంటుంది. నేనూ అంతే పర్సనల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాను కానీ అందరి మధ్య ఉన్నప్పుడు బుద్ధిగా నడుచుకుంటాను. అరుణ్ ఆదిత్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. 2014 నుంచి మేమిద్దరం సినిమా ఫీల్డ్ లో ఉన్నా…కలిసి నటించడం ఇప్పటికి కుదిరింది.

– ఈ సినిమాలోని పాటలన్నీ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనందరికీ లవ్ ఫీల్, రొమాంటిక్ ఫీల్ అంటే ఇష్టం. డియర్ మేఘలోని పాటలు ఆ ఫీల్ ను అందిస్తాయి. ఆమని ఉంటే పక్కన అనే పాట నా ఫేవరేట్ సాంగ్

– వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా మార్చేసేది ప్రేమ ఒక్కటే. తల్లిదండ్రుల ప్రేమ కొన్నాళ్లు, పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ, పిల్లల ప్రేమ..ఇలా మన లైఫ్ లోని అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. నా దృష్టిలో ప్రేమ గొప్పది, అది నిస్వార్థమైనది.

– నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్, అప్పటికి ప్రేమంటే ఏంటో తెలియని వయసది. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే జీవిత భాగస్వామి మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.

– డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. ప్రతి ప్రేమ కథలో ఉన్నట్లే ఇందులోనూ కొంత ట్రాజెడీ ఉంటుంది. ఈ సినిమాలో పర్మార్మెన్స్ విషయంలో నా మీద ప్రెజర్ కొంత ఎక్కువగా ఉండేది. ఎవరైనా తమకు నచ్చిన వాళ్లను కోల్పోతే జీవితంలో కుంగిపోతారు. నేనూ అలాగే ఫీల్ అవుతాయి.

– వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత అర్జున్ దాస్యన్ చాలా ఫ్రీడమ్ ఇచ్చి కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారు. నేను ఒక రోజు షూటింగ్ కు రాలేకపోయినా సిట్యువేషన్ అర్థం చేసుకుని అడ్జెస్ట్ చేసేవారు. ఎప్పుడూ మాకు అందుబాటులో ఉంటూ కావాల్సింది చూసుకున్నారు. చాలా మంచి ప్రొడ్యూసర్ అవుతారు.

– నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా ప్లాన్స్ అనుకున్నాను. కానీ కొన్నాళ్లకు తెలిసిందేంటంటే ఇక్కడ మన ప్లాన్ ప్రకారం ఏదీ జరగదు. ఏది జరగాలో అది జరుగుతుంది. మొదట్లో నేను నా కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్, సినిమాల్లో నటించాను. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ఇకపైనా అలాగే కంటిన్యూ చేస్తాను.

– ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నాను. గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Sushanth Reddy
  • #Adith Arun
  • #Arjun Dasyan
  • #Arjun Somayajula
  • #Dear Megha

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

17 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

15 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

16 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

1 day ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version