‘ఎఫ్ 2’లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటే అందరూ వావ్ అనుకున్నారు. ఆమె మేనరిజమ్‌కి ఫ్యాన్ అయిపోయారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’లో అంతకుమించి సందడి చేస్తోంది. కాస్త స్లిమ్ అయిన మెహ్రీన్‌ని చూసి కుర్రకారు మరోసారి టూ హాట్ అనుకుంటున్నారు. మరి అలాంటి హనీ… తన హీరోల గురించి ఏం చెబుతుందో చూద్దామా!
* ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’తో మెహ్రీన్ కౌర్ పిర్జాదా అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఆ సినిమా నాని ఎప్పుడూ ప్రత్యేకమేనట మెహ్రీన్‌కి. తొలి సినిమా హీరో కదా. మొదట్లో నానిని చూసినప్పుడు సరిగా మాట్లాడడేమోనని భయపడ్డా. కానీ, అదరితో కలివిడిగా ఉండే తీరు చూసి ముచ్చటేసిందట. సెట్‌లో బెరుగ్గా కూర్చునే మెహ్రీన్‌ను కూడా అందరిలో కలిసిపోయేలా చేసేశాడట.
* శర్వా, మెహ్రీన్ సెట్‌లో ఉంటే అల్లరే అల్లరి అట. వారిని ఆపడం ఎవరితరం అయ్యేదికాదట. ‘మహానుభావుడు’ సెట్‌లో తెగ సందడి చేశారట. ఇద్దరి మనస్తత్వాలూ, అభిరుచులూ ఒకలానే ఉంటాయట. ఎప్పుడన్నా కాస్త ఎక్కువ సమయం దొరికితే కునుకేసేసేవాళ్లట. తన పని తాను పర్‌ఫెక్ట్‌గా చేసుకెళ్లిపోతాడు. ఎవరైనా బాగా చేస్తే ఆ క్షణమే మెచ్చుకుంటాడు అంటూ శర్వా గురించి చెప్పింది మెహ్రీన్.
* గోపీచంద్ చాలా స్వీట్ అండ్ రిజర్వ్‌డ్ పర్సన్ అంటోంది మెహ్రీన్. ఎవరన్నా పలకరిస్తే తప్ప ఎక్కువగా మాట్లాడడట. ‘పంతం’ షూటింగ్ మొదలైన కొత్తల్లో మాట్లాడాలంటే కాస్త వెనకాడిందట. ఆ తర్వాత నా పక్కన కూర్చుంటే ఏదో ఒక విషయం చెప్పి గోపీ కూడా మాట్లాడేలా చేసేదట మెహ్రీన్. గోపీలా తక్కువ మాట్లాడటం కొందరికే సాధ్యమని చెప్పింది మెహ్రీన్.
* విజయ్ దేవరకొండకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. షెడ్యూల్ ప్రకారం పని చేసుకుని వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకోడట. ‘ఈ సీన్ మళ్లీ చేద్దామా’ అంటే అని అడిగితే కూల్‌గా ఒప్పేసుకుంటాడట. విజయ్ డెడికేషన్ చాలా నచ్చింది అని చెప్పింది మెహ్రీన్.
* వరుణ్‌తేజ్ పక్కన నిల్చోవాలంటే చాలా భయమట మెహ్రీన్‌కి. ఆరు అడుగుల మూడంగుళాల ఎత్తున్న వరుణ్ పక్కన ఆమె చాలా పొట్టిగా కనిపిప్తుందటన. వరుణ్ సెట్‌లో కామ్‌గా ఉన్నట్టు కనిపిస్తాడు గానీ అందరి మీద పంచ్‌లు వేస్తాడట. మెహ్రీన్ డైలాగులు పలికే విషయంలో వరుణ్ చాలా సాయం చేశాడట. తెలియని విషయాలు ఓపిగ్గా చెబుతుంటాట వరుణ్.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!