వరుణ్ తేజ్ సరసన నటించనున్న మెహ్రీన్

‘ఫిదా’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ మరింత ఉత్సాహంతో తొలి ప్రేమ చిత్రాన్ని చేస్తున్నారు. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో మల్టీస్టారర్ మూవీ మొదలు పెట్టనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి F2 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ట్యాగ్ లైన్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతోంది. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

కృష్ణగాడి వీర ప్రేమగాధలో పంజాబీ భామ మెహ్రీన్ మహాలక్ష్మి ల అందరి మతులు పోగొట్టిన ఈ భామ, అనిల్ రావిపూడి గత చిత్రం ‘రాజా ది గ్రేట్’ లో సైతం నటించి మెప్పించింది. అందుకే ఈ సినిమాలోనూ ఆమెనే ఓకే చేసినట్లు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి కి మాట ఇచ్చారు. ఘాజి సినిమాని తెరకెక్కించిన ఈ డైరక్టర్ మరో విభిన్నకథను వరుణ్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ముందుగా మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus