బెల్లంకొండ బాబు కోసం మెహరీన్, కాజల్

  • July 7, 2018 / 06:14 AM IST

ఇప్పుడున్న ప్రెజంట్ జనరేషన్ హీరోస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మహర్జాతకుడు అనే చెప్పాలి. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ స్టార్ హీరోయిన్లు, మాస్ డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది మనోడికి. బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా హీరోగా మాత్రం సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం బెల్లంకొండ బాబు చేతిలో మూడు సినిమాలున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాక్ష్యం” ఈ నెల విడుదలకు సిద్ధంగా ఉండగా.. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో మరో సినిమా ఆల్రెడీ మొదలెట్టాడు.

ఈ సినిమాలో కాజల్ ను మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ చేసుకొన్న బెల్లంకొండ బాబు ఇప్పుడు మరో హీరోయిన్ గా మెహరీన్ ను ఎంపిక చేసుకొన్నాడు. కాజల్, మెహరీన్ లు ఇద్దరూ పంజాబీ భామలు కావడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బఢెట్ తో నిర్మించనున్నారు. మొదటి సినిమాకే సమంతతో సరసాలాడే సదవకాశాన్ని సొంతం చేసుకొన్న బెల్లంకొండ అనంతరం తమన్నా, రకుల్ ప్రీత్, పూజా హెగ్డే, ఇప్పుడు కాజల్ & మెహరీన్ లతో జత కట్టడం అనేది ఇప్పటివరకు స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని అంశం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus