‘రాజా ది గ్రేట్’ లో రవితేజ పాత్ర గురించి చెప్పిన మెహ్రీన్
- April 18, 2017 / 07:11 AM ISTByFilmy Focus
గతఏడాది మాస్ మహారాజ్ రవితేజ ఒక సినిమా కూడా చేయలేదు. ఈ ఏడాది అతను రెండు సినిమాలు చేస్తున్నారు. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ తో “టచ్ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సినిమాను కూడా రవితేజ పట్టాలెక్కించారు. పటాస్’, ‘సుప్రీమ్’ విజయాలతో దర్శకుడిగా నిరూపించుకున్న అనిల్ రావిపూడి తో ‘రాజా ది గ్రేట్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ డార్జిలింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో రవి తేజ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “ఈ సంవత్సరం నేను చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. వాటిలో రవి తేజ గారితో చేస్తున్న ‘రాజా ది గ్రేట్’ కూడా ఒకటి. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. సినిమాలో ఆయనది చూపులేని పాత్రే అయినప్పటికీ, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నవ్వు తెప్పిస్తుంది. ” అని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















