Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » ఘనంగా జరిగిన ‘మెరిసే మెరిసే’ ప్రీ రిలీజ్ వేడుక, ఆగస్టు 6న థియేటర్ లలో మూవీ విడుదల

ఘనంగా జరిగిన ‘మెరిసే మెరిసే’ ప్రీ రిలీజ్ వేడుక, ఆగస్టు 6న థియేటర్ లలో మూవీ విడుదల

  • August 3, 2021 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా జరిగిన ‘మెరిసే మెరిసే’ ప్రీ రిలీజ్ వేడుక, ఆగస్టు 6న థియేటర్ లలో మూవీ విడుదల

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటళ్లో ఘనంగా జరిగింది. దర్శకులు సుకుమార్, వీవీ వినాయక్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల మాట్లాడుతూ…’మెరిసే మెరిసే’ లో మంచి మ్యూజిక్ కుదిరింది. విజయ్ ప్రకాష్, చిన్మయి, లిప్సిక, అనురాగ్ కులకర్ణి వంటి సింగర్స్ చాలా బాగా పాడారు. కనులతో రచించు కావ్యాలలో పాట పాడేప్పుడు విజయ్ ప్రకాష్, చిన్మయి చాలా ఎంజాయ్ చేశారు. దర్శకుడు పవన్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మన వాడిలా పని చేయించుకున్నారు. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా అనిపించింది. నెక్ట్ కూడా మేము కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తుంటే, అప్పుడే అయిపోయిందా అనిపించింది. శేఖర్ కమ్ముల గారి సినిమాలా ప్లెజంట్ గా ఉంటుంది. అన్నారు.

నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ….మా కొత్తూరి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ద్వారా పవన్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా మిగతా ఆర్టిస్ట్ లు అంతా చక్కగా నటించారు. ‘మెరిసే మెరిసే’ ఆగస్టు 6న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతోంది. మా సినిమాను థియేటర్ లలో చూసి మరిన్ని మూవీస్ చేసేలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నారు.

దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ….’మెరిసే మెరిసే’ మూవీ యువత ఆలోచనలు, ఆశలు, కోరికల గురించి తీసిన సినిమా. 20 ఏళ్ల వయసున్న యువతీ యువకుల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండదు. అలాంటి అమ్మాయి వెన్నెల, అబ్బాయి సిద్ధు. వీళ్లు ఇద్దరు ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సెస్ అందుకున్నారు అనేదే ఈ సినిమా. వీళ్లిద్దరివీ సెన్సిబుల్ క్యారెక్టర్స్. సినిమా అంతా ఎక్కడా ఐ లవ్ యూ కూడా చెప్పుకోరు. కానీ వాళ్ల మనసులు ఒకరికొకరు అర్థమవుతుంటాయి. చిన్న సినిమాకు ఎన్నో కష్టాలుంటాయి. కానీ నిర్మాత వెంకటేష్ గారు మా వెనక బలంగా నిలబడ్డారు. సినిమా క్వాలిటీ చూసి మరింత బడ్జెట్ పుష్ చేద్దాం అని ఎంకరేజ్ చేద్దాం. దినేష్, శ్వేతా క్యారెక్టర్స్ పోటా పోటీగా ఉంటాయి, అయినా దినేష్ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. మంచి కథ ముఖ్యం అన్నాడు. వెన్నెల అనే క్యారెక్టర్ లో శ్వేతా చక్కగా నటించింది. ఈ టైమ్ లో థియేటర్లలో రిలీజ్ అవసరమా అంటే అవసరమే అని చెబుతాను. ఎందుకంటే మన టెన్షన్స్ రిలీఫ్ అయ్యేది థియేటర్ లలోనే. సో థియేటర్ లకు వచ్చి మా శ్వేతా, దినేష్ పర్మార్మెన్స్ చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

లిరిసిస్ట్ కృష్ణవేణి మాట్లాడుతూ…మా నాన్న సదాశివుడు గారు చాలా పాటలు రాశారు. ఆయన స్ఫూర్తితోనే నేనూ లిరిసిస్ట్ అయ్యాను. పాటలు చాలా బాగా వచ్చాయి. మెలొడియస్ గా ఉన్నాయి. ‘మెరిసే మెరిసే’ చాలా ఫ్రెష్ ఫిల్మ్. నేటి యూత్ కు బాగా నచ్చుతుంది. కొత్త రచయిత వస్తున్నారంటే కాదనకుండా ఎంకరేజ్ చేశారు నిర్మాత వెంకటేష్ గారు. వాళ్లు అవకాశం ఇవ్వకుంటే ఈ స్టేజీ మీద ఉండేదాన్ని కాదు. అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్ లో చూడండి. అన్నారు.

నాయిక శ్వేతా అవస్థి మాట్లాడుతూ…’మెరిసే మెరిసే’ 6 ఆగస్టు మీ ముందుకొస్తోంది. అందరూ తప్పకుండా చూడండి. మా నిర్మాత వెంకటేష్ గారు సినిమా ప్రాసెస్ మొత్తం మాకు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ పవన్ గారితో పనిచేయడం మంచి ఎక్సీపిరియన్స్. యాక్టర్స్ అందరి నుంచి కావాల్సిన పర్మార్మెన్స్ తీసుకున్నారు. నేను సినిమా చూసినప్పుడు మ్యూజిక్ అమేజింగ్ గా అనిపించింది. నాకు తెలుగు రాదు. సీన్స్ చేసేప్పుడు దినేష్ చాలా సపోర్ట్ చేశాడు. ‘మెరిసే మెరిసే’ ను మీరూ ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ…’మెరిసే మెరిసే’ నా మూడో మూవీ. రెండు సార్లు పాండమిక్స్ వచ్చి, లాక్ డౌన్ లు ఎదురయ్యాక కూడా థియేటర్ ల ద్వారా మీ ముందుకు వస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ పవన్ నాకు దొరకడం నిజంగా అదృష్టం. అతను ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్. గుర్తుపెట్టుకోండి పవన్ టాలీవుడ్ లో మంచి హిట్ ఫిల్మ్స్ ఇస్తాడు. నిర్మాత అంటే మా వెంకటేష్ గారిలా సపోర్టివ్ గా ఉండాలి. మీరు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్వేతా స్వీట్ హార్ట్. తెలుగు ప్రేక్షకులకు శ్వేతా మరో క్రష్ అవుతుంది. ఇవాళ మంచి మనుషులు దొరకడం కష్టం. కానీ మా సినిమాకు అందరు ఒక మంచి ఇంటెన్షన్ తో పనిచేశాడు. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతను మరిన్ని సినిమాలు చేస్తాడని చెప్పగలను. మా సినిమాను ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు అని చాలా మంది అడిగారు. మాకు థియేటర్లంటే ప్రాణం. థియేటర్లతో మా లైఫ్ లో ఎన్నో ఎక్సీపిరియన్స్ ఉన్నాయి. ఇంట్లో బాగా లేకపోతే ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లి రిలీఫ్ అవుతాం. ఒక చిన్న సినిమా ఆదరణ పొందితే ఎంతోమంది డ్రీమ్స్ నిజం అవుతాయి. నేను సక్సెస్ అవ్వాలని స్నేహితులు చాలా మంది కోరుకోవడం నా అదృష్టం. మీరంతా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను. ‘మెరిసే మెరిసే’ ఒక క్లీన్ మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్ లలో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, ఇతర చిత్ర బృందం పాల్గొని ‘మెరిసే మెరిసే’ సినిమా విజయం సాధించాలని కోరారు.

నటీనటులు: దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు: బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌: మ‌హేశ్‌, పి.ఆర్‌.ఒ: సాయి స‌తీశ్‌

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bindu
  • #Dinesh Tej
  • #Guru Raj
  • #Kothuri Entertainments LLP
  • #Mani

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

9 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 days ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

1 day ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

1 day ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version