ఈమధ్య పోర్న్ స్టార్లు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం షరామామూలైపోయింది. సన్నీలియోన్ తో స్టార్ట్ అయిన వ్యవహారం ఇప్పుడు మరింతగా జోరందుకుంది. తాజా సమాచారం ఏంటంటే.. పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా త్వరలోనే హీరోయిన్ గా ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అది కూడా సౌత్ ఇండస్ట్రీలో అడుగిడనుంది. మలయాళంలో గతేడాది విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “చాక్జ్” అనే చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట సదరు దర్శకనిర్మాతలు.
అడల్ట్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాలో ఎవరైనా బోల్డ్ ఆర్టిస్ట్ నటిస్తే బాగుంటుందనే ఆలోచనతో తొలుత కొందరు మలయాళం ఆర్టిస్ట్స్ ని ట్రై చేయగా.. ఆ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ అండ్ బోల్డ్ గా నటించలేమని చెప్పగా.. అప్పటికే పోర్న్ మూవీస్ లో యాక్ట్ చేయడం మానేసి సినిమాల్లో ఎంట్రీ కోసం చూస్తున్న మియా ఖలీఫాను అప్రోచ్ అవ్వగా.. వెంటనే ఒకే చేసిందట మియా. సన్నీ స్థాయిలో మియా కూడా హిట్ అయితే.. ఇకపై పోర్న్ స్టార్స్ అందరూ సౌత్ ఇండస్ట్రీలో నటించడానికి క్యూ కట్టడమే కాదు సెటిల్ అయిపోతారు కూడా.