Mirai: ‘మిరాయ్’ కి అసలు సమస్య అదేనా..!

‘హనుమాన్’ తర్వాత హీరో తేజ సజ్జ సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. అతని నుండి రాబోతున్న కొత్త సినిమా ‘మిరాయ్’. ఇది కూడా సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమానే. చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉంది. గ్లింప్స్, టీజర్ ఇంప్రెస్ చేశాయి. కానీ ట్రేడ్లో ఎందుకో ఈ సినిమాపై అంచనాలు లేనట్లు కనిపిస్తుంది.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించారు పీపుల్ మీడియా వారు.

Mirai

ఏప్రిల్ లోనే రిలీజ్ అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టు 1కి పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఆ డేట్ నుండి కూడా తప్పించారు. సెప్టెంబర్ 5 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ డేట్ కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ‘మిరాయ్’ సినిమాకి వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తికాలేదట. మరోపక్క బిజినెస్ కష్టాలు కూడా ఎదుర్కొంటుంది. ‘హనుమాన్’ తో వచ్చిన హైప్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భారీ రేట్లు కోట్ చేశారట. బయ్యర్స్ అవి రిస్క్ అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.80 కోట్లు రాబట్టాలనేది పీపుల్ మీడియా వారి ప్లాన్ గా తెలుస్తుంది. కానీ అంత మొత్తం కష్టంగానే కనిపిస్తుంది. రూ.40 కోట్లు వరకు బయ్యర్స్ రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ లెక్కల పై చర్చలు కొనసాగుతున్నాయి. ‘హనుమాన్’ రిలీజ్ టైం వేరు. ఆ టైంలో దానికి ఉన్న బజ్ వేరు. కానీ ‘మిరాయ్’ కి అలాంటి బజ్ లేదు. ట్రైలర్ తో ఆ బజ్ తెచ్చుకోగలిగితే అప్పుడు బిజినెస్ స్పీడప్ అవ్వొచ్చు.

కల్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌కి కన్నడ హీరో ఫ్యాన్స్‌ బెదిరింపులు.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus