కే.జి.ఎఫ్ చాప్టర్ 1 చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అందుకే చాప్టర్ 2 పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కే.జి.ఎఫ్ చాప్టర్ 2 ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వం, రవి బస్రుర్ బి.జి.ఎం కలగలిపి సినిమాని ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. ఈ మూవీ ఓవరాల్ గా ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ నే అధిగమించింది అంటే ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిందో అర్థం చేసుకోవచ్చు.
నార్త్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.ఇదిలా ఉండగా ఈ చిత్రంలో చిన్న లాజిక్ మిస్ అయ్యింది అంటూ ప్రస్తుతం నెటిజన్లు ఈ మూవీ పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. విషయం ఏంటి అంటే.. సినిమా ప్రారంభంలో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ అలియాస్ రీనా ని ఎత్తుకొచ్చి కే.జి.ఎఫ్ లో పెడతాడు హీరో. అడిగితే నేను కే.జి.ఎఫ్ ను ఎలుతున్నాను కాబట్టి… నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటాడు.
అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి రవీనా టాండన్ అలియాస్ రమికా సేన్ ను ఏదైనా చేయమంటాడు పొలిటీషియన్ గురు పాండ్యన్ అలియాస్ అచ్యుత్ కుమార్.అప్పుడు రాఖీ బాయ్ … అమ్మాయిలను పిల్లల్ని తాను ఏమీ చేయనని, అమ్మాయికి కోపం వస్తే బొట్టుపెట్టి, పూజ చేయాలని చరిత్ర చెబుతుంది అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఇంత చెప్పినోడు హీరోయిన్ ను అలా బలవంతంగా తీసుకురావడం ఏంటి? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.