Actress Roja: మనసులోని మాటను బయటపెట్టిన ఎమ్మెల్యే రోజా!

  • February 8, 2022 / 01:44 PM IST

రాజకీయ నాయకురాలిగా, ఎమ్మెల్యేగా రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైసీపీ తరపున నగరి నియోజకవర్గం నుంచి రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో తనకు ప్రేక్షకుల్లో పాపులారిటీ రావడానికి కారణమైన జబర్దస్త్ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రోజా నగరిలో ఉన్న తన ఇంటిని చూపించారు. హోమ్ టూర్ లో భాగంగా ఇంద్ర భవనంలా ఉన్న తన ఇంటికి సంబంధించిన ఎన్నో విశేషాలను రోజా వెల్లడించారు.

Click Here To Watch

హైపర్ అది టీమ్ రోజా ఇంటికి వెళ్లగా రోజా హాలులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోను వాళ్లకు చూపించారు. ఆ తర్వాత మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అని ఆది రోజాకు చెప్పగా రోజా వెంటనే సూపర్ స్టార్ కృష్ణగారి కొడుకు మహేష్ బాబుతో తనకు యాక్ట్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఆది వెంటనే కృష్ణా రామా అని అనుకోకుండా కృష్ణగారి కొడుకు ఎందుకని రోజాపై పంచ్ వేశారు. ఆ తర్వాత రోజా కిచెన్ కు వెళ్లి వంట మనిషితో ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతారు.

వంట మనిషి వెంటనే మీరు కిచెన్ కు ఎప్పుడూ రారు కదా మేడమ్ అని రోజాతో చెప్పారు. ఈరోజు నేను వంట చేస్తాను నువ్వు వెళ్లు అంటూ రోజా వంట మనిషిని బయటకు పంపించి సాల్ట్ వేసి టీ తయారు చేస్తారు. రోజా చప్పట్లు కొట్టి గ్యాస్ స్టవ్ పై మంట వచ్చిందని చెప్పగా ఆది వంట గ్యాస్ వెలిగించి ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు రోజా ఆనందపడుతున్నారని కామెంట్లు చేశారు.

టీ ఎలా ఉంది అని రోజా అడగగా చాలా బాగుందని టీ అయితే ఇంకా బాగుండేదని ఆది కామెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. రోజాగారి ఇల్లు చాలా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus