Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మార్చి 23న కల్యాణ్‌రామ్‌ ‘ఎంఎల్‌ఎ’

మార్చి 23న కల్యాణ్‌రామ్‌ ‘ఎంఎల్‌ఎ’

  • March 14, 2018 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మార్చి 23న కల్యాణ్‌రామ్‌ ‘ఎంఎల్‌ఎ’

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం ‘ఎంఎల్‌ఎ’. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….

కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ – ”మా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీపుల్‌ మీడియా అసోసియేషన్‌లో చేసిన సినిమా ‘ఎంఎల్‌ఎ’. 2017లో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సహా అన్నీ పూర్తయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలను రేపు జరుగనున్నాయి. అది పూర్తయితే సినిమాను మార్చి 23న విడుదల చేస్తాం” అన్నారు. మా బ్యానర్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఇంతకు ముందు మా బ్యానర్‌లో యు.ఎస్‌లో రెండు ఇండిపెండెంట్‌ సినిమాలు చేశాం. ఫీచర్‌ ఫిలిం పరంగా ఇదే మా తొలి సినిమా. మంచి చిత్రంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం” అన్నారు.
వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ – ”ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను ఆల్‌రెడీ విడుదల చేశాం. వాటికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మరో రెండు సాంగ్స్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అలాగే మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.
భరత్‌ చౌదరి మాట్లాడుతూ – ” నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్‌లో చేసిన చిత్రమిది. ఈ సినిమా టీజర్‌, రెండు పాటలకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సెన్సార్‌ కారక్రమాలు పూర్తి అవుతాయి. కల్యాణ్‌రామ్‌గారు సినిమా పూర్తయ్యే వరకు చాలా మంచి సహకారం అందించారు” అన్నారు.

దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ ”మా ‘ఎంఎల్‌ఎ’ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. టైటిల్‌ని చూసి ఇది రాజకీయ సినిమా అనుకోవద్దు. చాలా ఫన్‌తో కూడుకుని ఉంటుంది. ఫస్టాఫ్‌ కార్పొరేట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సెకండాఫ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. సినిమాను మార్చి 23న విడుదల చేస్తున్నాం” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kalyan Ram
  • #MLA
  • #MLA Movie

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

19 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

5 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

6 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

22 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

23 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version