Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకొని కొడతా.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

Advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు వయస్సు ప్రస్తుతం 71 సంవత్సరాలు కాగా సినిమాల ఎంపిక విషయంలో మోహన్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హీరోగా, విలన్ గా టాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు తాజాగా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో కులాలు ఉన్నా సరే అందరూ ఆప్యాయంగా పిలుచుకునేవారని అక్క, అత్త, మామ, అల్లుడు అనే పిలుపులతో కలిసిమెలిసి ఉండేవాళ్లమని మోహన్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని కులం పేరుతో దూషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసలు కులాలను ఎవరు కనిపెట్టారని మోహన్ బాబు కామెంట్లు చేశారు. బాల్యంలో నా తోటి వాడిని అంటరానివాడు అని అంటే నేను చెప్పుడో కొడతానని చెప్పానని ప్రస్తుతం కులం పిచ్చి మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు.

ఇది నాశనానికి దారి తీస్తుందని మోహన్ బాబు పేర్కొన్నారు. అందుకే నాకు కులాలంటే అసహ్యం అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని తన యూనివర్సిటీలో మోహన్ బాబు మొక్కలు నాటారు. మోహన్ బాబు త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోహన్ బాబు రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది.

మోహన్ బాబుకు (Mohan Babu) కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు. మోహన్ బాబు భారీ సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కుల వ్యవస్థ గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయన కామెంట్లకు మద్దతు తెలియజేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus