Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Advertisement

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్‌లో ఏటా జరుపుకునే ‘డైరెక్టర్స్ డే’ వేడుకలు ఈసారి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి.

Mohan Babu

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ వేదికపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) చేసిన కొన్ని సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

స్టేజ్ పై మైక్ అందుకున్న మోహన్ బాబు ఎప్పటిలాగే తనదైన స్టైల్లో స్పీచ్ స్టార్ట్ చేశారు. తన కో-స్టార్స్ గురించి మాట్లాడుతూ.. ‘జయసుధ నాకు సహోదరి లాంటిది, కానీ జయప్రద మాత్రం నాకు సోదరి కాదు’ అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఈ డైలాగ్ వినగానే అక్కడే ఉన్న జయప్రద వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్!’ అంటూ సరదాగా ఆయనపైకి అరుచుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.

అనంతరం గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఓ సినిమా షూటింగ్ ముచ్చట్లను మోహన్ బాబు పంచుకున్నారు. దాసరి గారి డైరెక్షన్‌లో కృష్ణంరాజు, జయప్రద జంటగా ఓ సినిమా తీస్తున్నామని, ఉదయం 7 గంటలకు మొదలైన షూటింగ్.. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు నాన్‌స్టాప్‌గా జరిగిందని ఆయన చెప్పారు. ఆ సీన్‌లో తాను జయప్రదను లాక్కెళ్లిపోవాలని, అప్పుడు అల్లు రామలింగయ్య గారు తన దగ్గరికొచ్చి ‘అయ్యా, అంత ముద్దుగా ఉన్న అమ్మాయిని అలా ఎలా లాక్కెళ్తారు? ప్రాబ్లమ్ అవుతుంది కదా’ అని అడిగారని ఆనాటి ఫన్నీ ఇన్సిడెంట్‌ను గుర్తుచేసుకున్నారు.

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఎక్కడో ఉన్న తనకు నటన నేర్పి, డైలాగ్ డెలివరీలో స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసి.. అసలు ఈ ‘మోహన్ బాబు’ అనే పేరు పెట్టిన గురువు దాసరి నారాయణరావు గారే అని కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్‌కు తన వంతుగా రూ.15 లక్షల విరాళాన్ని మోహన్ బాబు ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆర్.బాల్కీ, యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్‌లకు జాతీయ స్థాయి ‘దాసరి పురస్కారాలు’ అందజేశారు.

విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus