జగన్ తో చెయ్యి కలపనున్న మోహన్ బాబు!
- April 7, 2016 / 10:43 AM ISTByFilmy Focus
మోహన్ బాబు అతి త్వరలో జగన్ రాజకీయ పార్టీలోకి చేరుతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా జగన్.. అతని సన్నిహితులు మోహన్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ నెలలోనే మోహన్ బాబు తను ఏ పార్టీలో చేరతాడనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. ప్రస్తుతం రాజకీయాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. నేను రావాల్సిన సమయం వచ్చిందని మోహన్ బాబు అన్నారు. అయితే కొత్తగా ఎలాంటి పార్టీ పెట్టట్లేదని తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో దాని వైపు మనసు మళ్లినా.. ఇప్పుడు మాత్రం వైకాపా వైపే అడుగులు వేయాలని మోహన్ బాబు నిర్ణయించుకొన్నారట.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















