గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో డైలాగ్ కింగ్..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో చిలుకూరు సమీపంలో వేసిన ఓ భారీ ఓడ సెట్ లో జరుగుతోంది. ఇక్కడ పలు యుద్ద
సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా, రాజమాతగా హేమ మాలిని నటిస్తుండగా.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినవస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్యను ఎదుర్కొనే రాజు పాత్ర ను మోహన్ బాబు పోషిస్తున్నాడని టాక్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయి బాబు, రాజీవ్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus