ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నానికి తొలి రోజుల్లో అవకాశం ఇచ్చాడు. అయితే నాని ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒకానొక కారణం కూడా ఈ దర్శకుడే. ఇదిలా ఉంటే తాజాగా నాని ఆయన దర్శకత్వంలో “జెంటిల్ మన్”అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాను ఎంచుకుని నాని పెద్ద రిస్కె చేశాడు అని టాలీవుడ్ కోడై కూస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటే…నాని తొలిసారి అటు విలన్ గాను, ఇటు హీరోగాను నటించిన సినిమా ఇది.
అయితే ట్రైలర్ లో హీరోనా.. విలనా అంటూ నాని చేస్తున్న ఈ హడావిడి బాగానే ఉన్నా ఇంద్రగంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవడం కాస్త తక్కువ శాతమే. అందుకే నానికి ఇదవరకు సినిమాల మార్కెట్ కన్నా ఇది తక్కువ అవుతుందట. ఇక నాని విలన్ గా చెయ్యడం కొత్త పాయంట్ అయినా..ఎక్కడో తెలియని ఆందోళన అభిమానుల్లో ఉంది. ఇక మరో పక్క…ఈ సినిమాలో విలన్ రోల్ ఒక అర్ధ గంట మాత్రమే నట.. అయితే అది డ్యుయల్ రోల్ కాదు నాని ఒక్కడే అటు విలన్ గా ఇటు హీరోగా చేస్తాడట.
ఇక ఆ అరగంట విలన్ పాత్రలో, నాని నటన సినిమాను పీక్స్ కు తీసుకెళ్తుంది అంటున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమా జూన్ 17న విడుదల అవుతుంది. మరి నాని చేస్తున్న ఈ రిస్క్ ఆయనకు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.