మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. చిరంజీవి మేనల్లుడు, యవ హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆయనకు కాబోయే కిరణ్ అలియాస్ కిరణ్మయితో గురువారం నిశ్చితార్థం జరిగింది. హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో వీరి ఎంగేజ్మెంట్ చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుక ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రియమైన సాయి ధరమ్ తేజ్– కిరణ్.. మీ అందమైన కొత్త ప్రారంభానికి అభినందనలు. మీ ఇద్దరికీ అంతులేని ప్రేమ, ఐక్యత, జీవితాంతం సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరి విషయంలో చాలా సంతోషంగా ఉంది అంటూ రామ్ చరణ్ ఆ పోస్టులో రాసుకొచ్చారు. దీంతో సాయితేజ్ ఎంగేజ్మెంట్ వార్త, ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నిశ్చితార్థ వేడుకకు సాయి దుర్గా తేజ్ పేరెంట్స్ డాక్టర్ శివ ప్రసాద్, విజయ దుర్గ, అతని సోదరుడు వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులు చిరంజీవి – సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి, అల్లు బాబీ – నీలా షా, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, నాగబాబు – పద్మజ; నిహారిక కొణిదెల, అల్లు అరవింద్ – అల్లు నిర్మల, అల్లు శిరీష్ – నయనిక రెడ్డి; అకీరా నందన్, ఆద్య, సుస్మితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
సాయి తేజ్ స్నేహితులు నటుడు మంచు మనోజ్ – మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, నటుడు హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల, హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. సాయి దుర్గా తేజ్, కిరణ్ వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో చేయనున్నారు. ఆ తర్వాత రిసెప్షన్ నిర్వహిస్తారని సమాచారం.