‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటాను అని ఆ మధ్య చెప్పారు. అయితే ఆ తర్వాత చేయబోయే సినిమా ఏంటి? అనేది మాత్రం చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట మోహన్ రాజాతో ఓ సినిమా చేస్తారు అని. అయితే నాగార్జున వందో సినిమా అది అవుతుంది అనే మాట కూడా వినిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది నిజం అనేది తెలియదు కానీ.. మోహన్‌రాజాతో నాగార్జున సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని మోహన్‌రాజానే ప్రకటించారు.
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రచారంలో భాగంగా మోహన్‌రాజా తెలుగు మీడియాతో ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలో తన కొత్త సినిమాల గురించి, తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అప్పుడే నాగార్జున సినిమా గురించి చెప్పారు. ఆ కేవలం నాగార్జున సినిమా కాదు. ఎందుకంటే ఇందులో నాగార్జునతోపాటు అఖిల్ కూడా నటిస్తాడట. అంటే మల్టీస్టారర్ అన్నమాట. నాగార్జున – అఖిల్‌తో ఓ స్టైలిష్ యాక్షన్ సినిమా చేయనున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు మోహన్‌రాజా.
ఈ సినిమాతో తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేస్తారా? లేక పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ చేస్తారా అనేది తర్వాత తెలుస్తుంది. అక్కినేని కాంబోలో ఇప్పటికే నాగార్జున – నాగచైతన్య సినిమా వచ్చింది. అదే ‘బంగార్రాజు’. ఇప్పుడు మోహన్ రాజా సినిమా కూడా వస్తే మరో అక్కినేని కాంబో కూడా అయిపోతుంది. అభిమానుల కోరిక తీరిపోతుంది. అయితే ముగ్గురు అక్కినేని హీరోలు కలసి నటించాలనే కోరిక మాత్రం ఉండిపోతుంది అనుకోండి.
ఇక మోహన్‌రాజా సినిమాల గురించి చూస్తే.. ‘‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సీక్వెల్ చేసే స్కోప్ అయితే ఉంది అన్న మోహన్‌రాజా.. ‘ధృవ 2’ సినిమా కూడా చేయాలన్న ఆలోచనా ఉంది. అయితే ఇవెప్పుడు ఇదెప్పుడు సాధ్యమవుతాయో చూడాలి అని అన్నారు మోహన్‌రాజా. కాబట్టి తొలుత మోహన్‌రాజా నుండి వచ్చేది నాగ్ – అఖిల్ సినిమానే. ‘గాడ్‌ఫాదర్’ రిలీజ్ అయ్యాక దీని గురించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలి అనే లింక్ ఉందేమో తెలియదు.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!