అనుష్క ‘భాగమతి’ లో జాతీయ స్థాయి నటుడు..!

  • May 4, 2016 / 11:17 AM IST

అనుష్క టైటిల్ పాత్రలో “భాగమతి” అనే సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. “పిల్ల జమిందార్” ఫేం అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ లేదా జూలై నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొన్న “జయరామ్”ను “భాగమతి” చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ దాదాపుగా 200 చిత్రాల్లో నటించిన జయరామ్ కు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus