ఈ నెల 17న గ్రాండ్ గా విడుదలవుతోన్న `మొనగాడు`
- June 11, 2022 / 06:51 PM ISTByFilmy Focus
కీలుగుఱ్ఱం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొనగాడు . వంశీ ఆకుల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ…“లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మొనగాడు చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇందలో దేవ్ గిల్, ఛత్రపతి పాత్రలు చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














