బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న మోనాల్ గజ్జర్, అఖిల్ సార్ధక్ హౌస్ లో ఉన్నంత కాలం ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉండేవారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయేవారు. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ జంట తమ రిలేషన్ ను కంటిన్యూ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించడం, ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
రీసెంట్ గా మోనాల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ ఎమోషనల్ గా ఓ పోస్ట్ కూడా పెట్టాడు. నువ్వే నా రాణి అంటూ ఆమెని తెగ పొగిడేశాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అఖిల్ పై తన ప్రేమను తెలియజేస్తూ మోనాల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ సంస్థ నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ జాబితాలో 2020 ఏడాదికి గాను మేల్ కేటగిరీలో అఖిల్ టాప్ ప్లేస్ లో నిలిచాడు.
దీంతో అతడికి సెలబ్రిటీలంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోనాల్ కూడా అఖిల్ ను విష్ చేస్తూ.. ”అందరూ చూడండి.. మా దోస్త్ అఖిలే నెంబర్ వన్” అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ పెట్టింది. అఖిల్ గతంలో కూడా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్, మోనాల్ కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!