దర్శకుడు మారుతితో సినిమా చేసే ఆసక్తి కనబరిచారు మెగాస్టార్ చిరంజీవి. గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విడుదల సమయంలో మెగాస్టార్.. మారుతితో సినిమా గురించి మాట్లాడారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యేలా కనిపిస్తుంది. రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోంది.
యువి బ్యానర్ లో ఎలాగూ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు కాబట్టి మళ్లీ వెంటనే తను కూడా అదే సంస్థకు సినిమా చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరని తెలుస్తోంది. మారుతి గనుక అద్భుతమైన కథ చెబితే అప్పుడు చిరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ సినిమా తరువాత మెగాస్టార్ తన సినిమాలకు సంబంధించి ఆలోచనలో పడ్డారు. జనాలు తనను ఎలా చూడాలనుకుంటున్నారనే విషయంలో మెగాస్టార్ కి క్లారిటీ కావాలి.
అందుకే చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసే వరకు మరే సినిమా అంగీకరించకూడదని అనుకుంటున్నారు. ఈ మూడు సినిమాలు విడుదల కావాలంటే వచ్చే ఏడాది వరకు ఎదురుచూడాలి. ఈలోగా మారుతికి మంచి కథ సెట్ అయితే ఓకే.. లేదంటే చిరు ప్రాజెక్ట్ ఉండదనే అనుకోవాలి. మరోపక్క మారుతి.. ప్రభాస్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా.. మారుతి స్టైల్ లో ఈ సినిమా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి.. మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!