తెలుగులో ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేస్తుందనే వివాదాన్ని ఎదుర్కొంటున్న విజయ్ ‘వారసుడు’ సినిమా తమిళంలో మాత్రం థియేటర్ల విషయంలో ఇబ్బంది పడుతోంది. అజిత్ ‘తునివు’ సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి డిస్ట్రిబ్యూటీ చేస్తుండడంతో ఎక్కువ శాతం స్క్రీన్స్ దానికే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు కేటాయించారనే విషయం బయటకు రానప్పటికీ.. ఫైనల్ లిస్ట్ ఏంటో తెలుసుకున్న అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.
అజిత్, విజయ్ సినిమాలు సంక్రాంతికి పోటీ పడడం ఇదేం కొత్త కాదు. ఇదివరకు చాలా సార్లు ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ‘వారసుడు’ నిర్మాత దిల్ రాజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నెట్ వర్క్ ఉంది కానీ కోలీవుడ్ లో మాత్రం ఆయన ప్లాన్స్ వర్కవుట్ అవ్వడం లేదు. ‘వరిసు’ సినిమాను కూడా ఉదయనిధి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారని టాక్.
అయినప్పటికీ అజిత్ సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నట్లు టాక్. అయితే విజయ్ కానీ అజిత్ కానీ ఈ వ్యవహారాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. షూటింగ్ చివరి దశలో ఉండడం వలన ఈ హీరోలు మీడియా ముందుకు రావడం లేదు. ఒకవేళ విజయ్ సినిమాకి తమిళనాడులో ఎక్కువ థియేటర్లు దొరక్కపోయినా.. తెలుగులో మాత్రం గ్రాండ్ రిలీజ్ అయితే ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ బయటకు రాలేదు. అవి రిలీజైతే సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.