తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన జానపద గాయని మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది అని చెప్పాలి. వాస్తవానికి వివాదాలు అనేవి మంగ్లీకి కొత్తేమీ కాదు.
కానీ ఇప్పుడు వచ్చిన కష్టం వేరు. ఒక భారీ ఆర్థిక కుంభకోణంలో ఆమె ఇరుక్కుంది.ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది అనే చెప్పాలి.
‘నాకు ఏ సంబంధం లేదు.. నిరూపిస్తే శిక్షకు సిద్ధం’ అంటూ మంగ్లీ సవాలు విసిరినప్పటికీ, ఇటీవల బయటపడిన ఆమె సోదరుడి బ్యాంక్ లావాదేవీలు ఈ కేసును ఊహించని మలుపు తిప్పింది అని చెప్పాలి.ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామావత్ మధుకు, మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మధు ఖాతా నుండి శివ ఖాతాలోకి మూడు విడతలుగా భారీ నగదు బదిలీ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆధారాలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని వల్ల ఒకరకంగా మంగ్లీ ఫ్యామిలీ మొత్తం చిక్కుల్లో పడినట్టే అని చెప్పాలి. ఈ కేసులో భాగంగా ఆల్రెడీ రామావత్ మధు బ్యాంక్ ఖాతాలు సీజ్ అయ్యాయి. ఇది వ్యాపార సంబంధిత బదిలీలా లేక స్కామ్ సోమ్మా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
త్వరలో మంగ్లీ తమ్ముడితో పాటు మంగ్లీని కూడా పోలీసులు విచారణకి పిలిచే అవకాశం ఉంది. అటు తర్వాత మంగ్లీ, శివ చౌహాన్‌లను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.