‘సింధూరం’ టు ‘విరాటపర్వం’… నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 క్రేజీ సినిమాలు..!

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరు ఆర్.నారాయణ మూర్తి గారు. ప్రజా సమస్యలు, విప్లవ పోరాటం కథాంశాలతో గతంలో ఆయన చాలా సినిమాలు చేశారు. అందులో కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించడం, మరికొన్ని సినిమాలను ఆయన నిర్మించడం కూడా జరిగింది. ‘మా భూమి’, ‘యువతరం కదిలింది’, ‘ఎర్ర సైన్యం’…ఇలాంటి సినిమాలు ‘ఆర్.నారాయణ మూర్తి గారు చేసి ఇలాంటి సినిమాలకు ఆయన కేర్-అఫ్-అడ్రెస్’ గా నిలిచారు.ఇందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి కూడా. రాను రాను ఇలాంటి సినిమాలు చేయడం తగ్గించారు ఫిలిం మేకర్స్.బహుశా వివాదాల జోలికి పోకూడదు అనే ఉద్దేశంతో కావచ్చు..! అయితే విచిత్రంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు కొన్ని రూపొందాయి.

మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ‘విరాట పర్వం’ మూవీ ఇలాంటి కథాంశంతో రూపొందిన సినిమానే.! 1990లలో పోలీసులకి, నక్సలైట్ లకి మధ్య జరిగిన పోరాటం. పెద్ద వాళ్ళు పేద ప్రజలను అణగదొక్కడం, వారిపై దౌర్జన్యం చేయడం, మాన ప్రాణాలను తీసి వారి అన్యాయం చేయడం వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి నెలకొంది. మరి ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలీదు కానీ ప్రమోషన్స్ తో జనాలను ఆకర్షించడంలో అయితే సక్సెస్ అయ్యింది.సరే ఈ విషయాన్ని పక్కన పెట్టి నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సినిమాలు ఏంటో.. అందులో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి.. అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) సింధూరం :

బ్రహ్మాజీ, రవితేజ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. నక్సలైట్ ల భావోద్వేగాలను, అధికారులు, పోలీసులు దౌర్జన్యాలు ఇందులో చూపించారు. సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది.

2) 143 :

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… నక్సలైట్లు, పోలీసుల పోరుకి మధ్యలో నలిగిన ప్రేమకథగా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ అనిపించుకుంది.

3) జల్సా :

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నక్సలైట్ గా కనిపించారు. సెకండ్ హాఫ్ లో ఈ నేపధ్యం కనిపిస్తుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

4) గమ్యం :

అల్లరి నరేష్- శర్వానంద్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

5) రక్త చరిత్ర :

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా నటించాడు. పరిటాల మూర్తి జీవిత కథతో రూపొందిన ఈ చిత్రం నక్సలిజం టచ్ ఉంటుంది. ఈ సినిమా బాగానే ఆడింది. అయితే పార్ట్ 2 ప్లాప్ అయ్యింది.

6) విరోధి :

నీలకంఠ దర్శకత్వంలో శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

7) దళం :

నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకుడు. ఈ మూవీ కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. మంచి టాక్ ను రాబట్టుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

8) అప్పట్లో ఒకడుండేవాడు :

నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకుడు.ఈ మూవీ కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అనిపించుకుంది.

9) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ లు హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీనే..! కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విజయం సాధించలేదు.

10) విరాట పర్వం :

రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకుడు. ఈ మూవీ కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus