ఈ ఏడాదిలో సినిమాలకి కాసులు కురిపించే దాదాపు అన్ని సీజన్లు ముగిసాయి. దీపావళికి ఒక్కరోజు సెలవు ఇస్తున్నప్పటికీ తమిళ సినిమా “సర్కార్” తెలుగులోనూ రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ఇక మిగిలిన ఒకే ఒక్క సీజన్ క్రిస్మస్. ఈ పండుగ సందర్భంగా నాలుగైదు రోజులు సెలవులు రానున్నాయి. ఆ సెలవలని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు డిసెంబర్ 21న మూడు సినిమాల రిలీజ్ కావడానికి ముస్తాబు అయ్యాయి. అవి ఏమిటంటే… శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన “పడిపడి లేచే మనసు”, వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ మూవీ “అంతరిక్షం 9000 కెఎంపిహెచ్”, మమ్ముట్టి మూవీ “యాత్ర”.
ఈ మూడు సినిమాల జోనర్స్ డిఫరెంట్. “యాత్ర” వైస్సార్ పాదయాత్రపై రూపుదిద్దుకుంటున్న బయోపిక్. మాస్ ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇందుకోసం వైఎస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమా విషయానికి వస్తే అంతరిక్షం నేపథ్యంలో సాగే మూవీ. క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. “పడిపడి లేచే మనసు”.. ప్రేమకథ చిత్రం.. యువతని టార్గెట్ చేసిన మూవీ. అందుకే మూడు ఒకేరోజు వస్తున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారు. ఏది బాగుంటే ఆ మూవీ భారీ కలక్షన్స్ అందుకునే ఆస్కారం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.