వినూత్న రీతిలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా ప్రమోషన్

  • August 18, 2023 / 07:59 AM IST

‘బిగ్ బాస్ 4 ‘ కంటెస్టెంట్ సొహైల్ అందరికీ సుపరిచితమే. ఓ రకంగా ఇతను ‘బిగ్ బాస్’ విషయంలో గేమ్ ఛేంజర్ అని చెప్పాలి. ఆ సీజన్లో విన్నర్ తో సమానంగా ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు సొహైల్. దీంతో ఒక్కసారిగా అతని పేరు మార్మోగింది. ప్రస్తుతం అతను హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 18 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

టీజర్, ట్రైలర్లు, పోస్టర్లతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ట్రైలర్ లో ఎమోషనల్ కంటెంట్ ఉంది. ‘మైక్ మూవీస్’ బ్యానర్‌ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. ‘మైత్రీ మూవీ’ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు రావడంతో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

చిత్ర బృందం అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇది పక్కన పెడితే.. ఈ మధ్య కొన్ని సినిమా యూనిట్లు.. తమ సినిమాపై కాన్ఫిడెన్స్ ఉంటే.. ప్రీమియర్స్ వేసుకోవడానికి ముందుకు వస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ యూనిట్ కూడా అదే పద్ధతిని అనుసరించింది.

నిన్న ఏకంగా 200 మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ఆ షోల నుండీ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎమోషనల్ గా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయినట్టు .. సినిమా చూసిన గర్భిణీ స్త్రీలు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమోషన్ కొత్తగా ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus