ఆర్టిస్టుల బ్రతుకులు అలా ఉంటాయని చెప్పిన ఎమ్మెస్ విక్రమ్!

Advertisement

ఎమ్మెస్ విక్రమ్ అంటే ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోయినా ఎమ్మెస్ నారాయణ కొడుకు విక్రమ్ అంటే సులువుగా అర్థమవుతుంది. ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెస్ విక్రమ్ మాట్లాడుతూ నటుడిగా చేసినంత వరకు హ్యాపీ అని తెలిపారు. రాబోయే రోజుల్లో పాత్రలే హీరోలు అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. సీడీ, క్యాసెట్, రీల్ పోయి చిప్ వచ్చిందని ఎమ్మెస్ విక్రమ్ అన్నారు. నేనెప్పుడూ గొప్ప అని ఫీలైతే బాధ పడాలని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఉన్నదానితో నేను హ్యాపీ అని ఆయన కామెంట్లు చేశారు. సెలబ్రిటీల కొడుకులు కాకపోయి ఉంటే వాళ్లు తప్పకుండా పైకి వచ్చేవారేమో అని విక్రమ్ కామెంట్లు చేశారు. బ్రహ్మానందం గారి అబ్బాయి ఆయన కొడుకు కాకపోయి ఉంటే ఈరోజు స్టార్ హీరో అయ్యేవాడేమో అని విక్రమ్ అన్నారు. పెద్ద పెద్ద స్టార్స్ ను చూస్తూ బ్రహ్మానందం గారి అబ్బాయిని ఎలా స్టార్ చేస్తారని ఇది అందరికీ వర్తిస్తుందని విక్రమ్ పేర్కొన్నారు.

అలా కాకుండా సొంతంగా వస్తే క్లిక్ అయ్యేవాళ్లమేమో అని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడికైనా వెళితే ఎమ్మెస్ గారి అబ్బాయి అని అంటారని వాళ్లు అ స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము ఈ పాత్ లో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. మా నాన్న సక్సెస్ అయ్యాడు అని మాకు విచ్చలవిడిగా ప్రయాణం చేసే ఛాన్స్ లేదని ఆయన కామెంట్లు చేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోయినా ఇతర రంగాల్లో సక్సెస్ అయిన సెలబ్రిటీల కొడుకులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

సాధారణంగా వచ్చేవాళ్లు ఏదైనా చెయ్యగలరని మాకు అలా చేసే అవకాశం ఉందని విక్రమ్ కామెంట్లు చేశారు. నేను వేరు మా నాన్న వేరు కాదని మనకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటే అవుతామని ఆయన కామెంట్లు చేశారు. దాసరి గారు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారని ఆయన కొడుకుకు ఇండస్ట్రీ వల్ల ఏం బెనిఫిట్ కలిగిందని ఆయన తెలిపారు. దాసరి అరుణ్ బాగా కష్టపడ్డాడని ఎమ్మెస్ విక్రమ్ కామెంట్లు చేశారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus