Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

  • April 15, 2026 / 11:48 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన “శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రాలు ఒక ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన ‘అగధ’ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు.

Agadha Movie

‘అగధ’ ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్ ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది ‘అగధ’ సినిమా పోస్టర్ . ఆ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. ఒక చీకటి గుహ. చుట్టూ వెలుగుతోన్న కొన్ని కాగడాలు. చీకటే కాదు ఆ సన్నని వెలుతురు కూడా భయానకంగా ఉంది.
అక్కడ ఒక భారీ విగ్రహం. మొహమంతా మిస్టిక్ గా ఉంది. ఆ విగ్రహానికి 12 చేతులు.

ఈ విగ్రహం ముందు … వెనుతిరిగి ఉన్న ఒకమ్మాయి . ఆమె వేషధారణ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఈ పోస్టర్ తోనే ఒక ఆసక్తిని జనరేట్ చేశారు ఎమ్మెస్ రాజు.

మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా ‘అగధ’ను రూపొందిస్తున్నారాయన. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘అగధ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ “ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేసాం. ఈ సినిమాలో 45 నిమిషాల వి ఎఫ్ ఎక్స్ ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్ , నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, రచన- దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agadha Movie
  • #MS Raju

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

28 mins ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

3 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version