మంచింగ్ విత్ మహాతల్లి.. మస్త్ మజా
- March 30, 2017 / 01:08 PM ISTByFilmy Focus
యూట్యూబ్ లో మహాతల్లి అనే ఛానల్ లో ప్రతి బుధవారం లేటెస్ట్ టాపిక్ తో వీడియోలు రిలీజ్ చేసి అలరిస్తున్న జాహ్నవి దాశెట్టి మరింత మజా అందించడానికి సిద్ధమైంది. వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ వియు వారు జాహ్నవితో “మంచింగ్ విత్ మహాతల్లి” అనే కార్యక్రమాన్ని రూపొందించింది. తెలుగు సినిమాల్లో పాపులర్ అయినా కొన్ని క్యారెక్టర్స్ ని ఇంటర్వ్యూ చేసే థీమ్ తో ఈ వెబిసోడ్లను మలిచారు. ప్రతి ఎపిసోడ్ లోను ఒక పాత్ర ఈ షోకి వచ్చి తన అనుభవాలను పంచుకుంటుంది.
ఇటు హోస్టుగానూ, గెస్ట్ గాను రెండు పాత్రల్లో జాహ్నవి నటిస్తూ డబుల్ ధమాకా అందించనుంది. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ షోకి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. వియు, తమడా మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ “మంచింగ్ విత్ మహాతల్లి”ని మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే www.viu.com లో లాగిన్ అవ్వండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














